మనం టౌన్ లో బైక్/ కార్ లో వెళ్తున్నప్పుడు మనకు అర్జంట్ గా Toilet గా వస్తుంటే మనకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు, చుట్టూ జనాలతో రద్దీగా ఉంటుంది కనుక పబ్లిక్ గా కూడా యూరినల్ చేయలేము(చెయ్యకూడదు)…అలాంటప్పుడు మీకు దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ లో ఉన్న Toilet ని Use చెయ్యొచ్చు ఎందుకంటే ఆ toilet maintenance కి మనం డబ్బులు ఇస్తున్నాం అని మీకు తెలుసా??
అవును…మీరు చదివింది నిజమే…. పెట్రోల్ బంక్స్ లో ఉండే toilet maintenance కి ప్రజలే డబ్బులు చెల్లిస్తున్నారు.
దీనికోసం పెట్రోల్ బంక్ వాళ్ళు బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే ప్రతి కస్టమర్ నుంచి ప్రతి లీటర్ కి 6 పైసలని Toilets maintenance కోసం, 4 పైసలని Drinking water కోసం వసూలు చేస్తున్నారు.
కనుక ప్రతి పెట్రోల్ బంక్ లో పరిశుభ్రమైన టాయ్ లెట్స్, మంచి త్రాగు నీరు ఉంచడం పెట్రోల్ బంక్ యాజమాన్యం బాధ్యత….ఈ సౌకర్యాలు ను బంక్ కి వచ్చే ప్రతి కస్టమర్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

అలానే మీకు బంక్ లో Toilets maintenance బాగోలేదనిపించిన, Drinking water లేకపోయినా భారత ప్రభుత్వ Swachhta App ద్వారా మీరు ఉన్నతాధికారులకు పిర్యాదు చెయ్యొచ్చు